మెగా ఫ్యాన్స్‌కు ఇంతకంటే ఏం కావాలి

mega-fans-waiting-for-chiranjeevi-birthday

మెగా ఫ్యాన్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే అంటే పండగ. చిరంజీవి పుట్టిన రోజు మెగా హీరోల సినిమాల టీజర్‌లు, ఫస్ట్‌లుక్‌లు వస్తూ ఉంటాయి. ఈ సారి ఏకంగా చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ లేదా పోస్టర్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రం షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు టైటిల్‌ లోగో వచ్చింది తప్ప సినిమాకు సంబంధించిన చిరు స్టిల్‌తో ఫస్ట్‌లుక్‌ రాలేదు. ఇప్పటికే చిరంజీవి స్టిల్స్‌ లీక్‌ అయిన కారణంగా టీజర్‌ అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. టీజర్‌ కోసం ప్రత్యేకంగా కొన్ని షాట్స్‌ను చిత్రీకరిస్తే బాగుంటుందని మెగా సన్నిహితులు చెబుతున్నారు.

చిరంజీవి బర్త్‌డే అయిన ఆగస్టు 22న సైరా ఫస్ట్‌లుక్‌తో పాటు రామ్‌ చరణ్‌ తాజా మూవీ ఫస్ట్‌లుక్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను కూడా ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే చరణ్‌ ప్రకటించాడు. ఈమద్య కాలంలో ప్రముఖ డేట్స్‌ ఏమీ లేవు కనుక, తన తండ్రి అయిన చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగానే సినిమా టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అదే సమయంలో కళ్యాణ్‌ దేవ్‌ రెండవ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. మెగా మేనల్లుడు కూడా చిరు బర్త్‌డే కానుక ఇవ్వబోతన్నాడు. మొత్తానికి చిరంజీవి బర్త్‌డేకు మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌.