‘సైరా నరసింహారెడ్డి’కి ఇవి పెద్ద ప్లస్‌

Amitabhachan Will Take Syra Narasimha Reddy Movie To Another Level

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందే. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా టైటిల్‌ను ప్రకటించి మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కంచారు. టైటిల్‌తో పాటు, పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మెగా రేంజ్‌లో ఉందని అభిమానులు మరియు సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించడం కూడా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌ నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణ.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అయిన అమితాబచ్చన్‌ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకు వెళ్లడం ఖాయం అని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో అమితాబచ్చన్‌ పెద్దగా కనిపించింది లేదు. అమితాబచ్చన్‌ కారణంగా బాలీవుడ్‌లో ఈ సినిమాకు భారీ క్రేజ్‌ దక్కే అవకాశం ఉంది. ఇక కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌ నటించడం కూడా ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ‘ఈగ’ చిత్రంలో నటించి సూపర్బ్‌ అనిపించిన సుదీప్‌ సైరా చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాడు. ఈయన కారణంగా కన్నడంలో ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్‌ రావచ్చు. ఇక విజయ్‌ సేతుపతి మరియు జగపతిబాబులు కూడా సినిమాకు ప్రధాన బలంగా ఉంటారు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ ఈ చిత్రానికి ట్యూన్స్‌ అందించనుండటం సినిమాకే హైలైట్‌ అవ్వడం ఖాయం. నయనతార కూడా సినిమాకు బలంగా మారే అవకాశాలున్నాయి. మొత్తానికి పలు పాజిటివ్‌ అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ను ఈ సినిమా క్రాస్‌ చేయడం ఖాయం అని ఇప్పటి నుండే ఊహాగానాలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు: