నంద్యాల పోలింగ్ సరళి ఇది.

nandyal by election polling start

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మీడియా , సర్వే ఏజెన్సీల హడావిడి కూడా బాగా కనిపిస్తోంది. ప్రతి బూత్ లో ఓటింగ్ సరళి అంచనా వేయడానికి ప్రధాన రాజకీయ పక్షాల నేతలు ప్రయతిస్తున్నారు. ఇప్పుడు దాకా ఓటింగ్ జరుగుతున్న తీరు పట్ల ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా అంతృప్తిగా వున్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా కూడా ఓటు వేసాక ఇప్పటిదాకా పోలింగ్ బాగానే జరుగుతోందని, ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత అధికార పక్షం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల పోలింగ్ తీరు మీద ఇటు అధికార తెలుగు దేశం నేతలు ఫుల్ ఖుషీ గా వున్నారు. నంద్యాల గెలుపు కోసం తాము పన్నిన వ్యూహాలన్నీ విజయవంతం అయినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న విధానం చూస్తుంటే తమ గెలుపు ఖాయం అన్న విశ్వాసం టీడీపీ క్యాంపు లో కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తూ పార్టీ శ్రేణుల్ని అప్రత్తంగా ఉంచుతున్నారు. నిరంతరం ఫోన్ ద్వారా పార్టీ ఆఫీస్ నుంచి నంద్యాల తమ్ముళ్లకు అవసరమైన ఆదేశాలు అందుతున్నాయి.

మరిన్ని వార్తలు:

పేరుకే అగ్రరాజ్యం.. సెక్యూరిటీకి జీతాల్లేవ్

మరో వివాదంలో స్మృతి..

చిరుకు పవన్‌ శుభాకాంక్షలు