మరో వివాదంలో స్మృతి..

pahlaj-nihalani-sacked-as-censor-board-chief-prasoon-joshi-to-take-over

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఎపిసోడ్ అన్ని పార్టీలు కార్నర్ చేసిన వ్యక్తి అప్పటి మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ. అప్పట్లో పార్లమెంట్ లో ఆమె స్పీచ్ దంచేసినా.. తర్వాత విమర్శలు ఆగకపోవడంతో.. మోడీ ఆమెను శాఖ మార్చారు. తర్వాత జౌళి శాఖకు వెళ్లిన స్మృతి.. అక్కడా తనదైన శైలిలో సిన్సియర్ గానే పనిచేశారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లాక ఆమెకు సమాచార, ప్రసార శాఖ అప్పగించారు.

సరిగ్గా స్మృతి బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీతో రగడ వచ్చింది. ఇందూ సర్కార్ మూవీకి సర్టిఫికెట్ ఇవ్వాలని తనపై ఒత్తిడికి గురిచేశారని నిహ్లానీ చెప్పారు. అయితే తాను మొదట సర్టిఫికెట్ కు నిరాకరించినా.. చివరకు ఒత్తిడి కారణంగా 70 కట్లతో ఓకే చెప్పానన్నారు. అప్పట్నుంచీ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు పహ్లాజ్. ఆ వివాదం తరుణంలోనే తనను తప్పించి ప్రసూన్ జోషీని తెచ్చారన్నారు.

తానంటే ఇష్టం లేకపోతే ఓ మాట చెబితే గౌరవంగా తప్పుకునే వాడ్నని, కానీ ప్రసూన్ జోషీ నియామకం తర్వాత కూడా తనకు విషయం చెప్పకపోవడం బాథ కలిగించిందన్నారు పహ్లాజ్. పహ్లాజ్ నిహ్లానీ ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రదాని మోడీపై బుక్ రాసిన చరిత్ర ఉన్న పహ్లాజ్ మాటల్ని మోడీ సీరియస్ గా తీసుకుంటే.. స్మృతి సమాచార శాఖ ఊడక తప్పదనే మాట వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు:

ట్రిపుల్ త‌లాక్ తీర్పుపై హ‌ర్షాతిరేకం

యానిమేటడ్ వీడియోతో భ‌య‌పెడుతున్న ఉత్త‌ర‌కొరియా