పేరుకే అగ్రరాజ్యం.. సెక్యూరిటీకి జీతాల్లేవ్

secret-service-out-of-money-to-pay-agents-because-of-trumps

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఇప్పటికే పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో ట్రంప్ కు సెక్యూరిటీ అందించే సీక్రెట్ సర్వీస్ కూడా ఆయన తీరుతో ఇబ్బంది పడుతోంది. కేవలం సెప్టెంబర్ వరకే జీతాలకు డబ్బులున్నాయని వారు చెబుతున్న మాటలు విని.. సెక్యూరిటీ ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి.

సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్ వరకు సెక్యూరిటీ ఏజెన్సీలకు డబ్బులు చెల్లిస్తారు. కానీ ఈసారి ట్రంప్ హయాంలో మాత్రం సెప్టెంబర్ వరకే డబ్బులున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ టూర్లు ఎక్కువ కావడమే. ప్రతి టూర్ కు భారీగా ఖర్చవుతోంది. ఆయన కుటుంబం పెద్దది కావడంతో.. వాళ్లందరికీ సీక్రెట్ సర్వీసే సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తోంది. దీంతో సీక్రెట్ సర్వీస్ పై భారం పెరిగింది.

ఇప్పటికే రెండుసార్లు సెక్యూరిటీ నిధులు పెంచాలని కాంగ్రెస్ ను అడిగి అనుమతి తీసుకున్నారు. మళ్లీ అనుమతి అడిగితే ఇస్తారా.. ఇవ్వరా అనేది తేలాల్సి ఉంది. ఈ సమయంలో ట్రంప్ కు సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ ఆదనపు పని గంటలు కూడా పనిచేస్తున్నారట. దాదాపు 1100 మందిని కొత్తగా తీసుకోవడంతో.. వారందరికీ జీత భత్యాలు చెల్లించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు:

మరో వివాదంలో స్మృతి..

ట్రిపుల్ త‌లాక్ తీర్పుపై హ‌ర్షాతిరేకం