కాకినాడలో టీడీపీ కి కమ్మ సెగ .

TDP and YSRCP caste politics in kakinada municipal corporation election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ రాజకీయాల్లో కులానికి మించిన ప్రభావం ఉండబోదని ఓ బలమైన నమ్మకం. ఇది పూర్తిగా నిజం కాదని చెప్పే ఘటనలకు నంద్యాల, కాకినాడ ఎన్నికలు వేదిక అయ్యాయి. నంద్యాలలో రెడ్లంతా వైసీపీ కి మాత్రమే ఓటు చేయబోరని ఇప్పటికే తేలింది. ఇక కాకినాడలో అంతకు మించిన డ్రామా నడుస్తోంది. దాంతో అక్కడ ఎవరూ ఊహించని విధంగా టీడీపీ కి కమ్మ సెగ తగులుతోంది. అదెలాగో చూద్దామా!

ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమ నేపథ్యంలో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ కి పెద్ద సవాల్ గా మారాయి. ముద్రగడ ఉద్యమం సాగుతున్నప్పటికీ కాపులు తమ వైపే వున్నారని చెప్పుకునేందుకు టీడీపీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్ని దశల్లో కాపు వర్గాన్ని ఆకట్టుకునే చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో టీడీపీ కి ఆది నుంచి అండగా ఉంటున్న కమ్మ సామాజిక వర్గానికి మొండిచేయి తప్పలేదు. దీంతో ఆ వర్గం ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అటు కమ్మలకి వ్యతిరేకం అనుకునే వైసీపీ ఆ వర్గానికి చెందిన ఇద్దరికి సీట్లు ఇచ్చింది. దీంతో టీడీపీ లో అసంతృప్త కమ్మ నాయకులు వైసీపీ కి మద్దతు ఇవ్వడానికి రెడీ అయిపోయారు.

చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ అసంతృప్తిని పసిగట్టింది టీడీపీ అధిష్టానం. అందుకే పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ని వెంటనే రంగంలోకి దింపింది. స్థానిక నాయకుల్ని టీడీపీ కి అంతకు ముందు లాగానే చురుగ్గా పని చేసేలా ఒప్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల ప్రచారం అయిపోగానే టీడీపీ లోని మరికొందరు కాకినాడ చేరుకున్నారు. దీంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి కాకినాడ లో టీడీపీ కి కమ్మ సెగ ఎపిసోడ్ నేటి తరం రాజకీయాలకు అద్దం పడుతోంది.

మరిన్ని వార్తలు:

తెలంగాణ అంటే ఎగిరి గంతేస్తున్న ఐఏఎస్ లు

ఎవరికి వారే గెలుపుల వారే

పేరుకే అగ్రరాజ్యం.. సెక్యూరిటీకి జీతాల్లేవ్