శ్రీరెడ్డి ఉద్యమంపై కంగనా రనౌత్‌ రియాక్షన్‌

Kangana Ranaut about Sri Reddy Strip Protest

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌ విధానంకు వ్యతిరేకంగా శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమమే చేస్తోంది. ఈమె పలువురు స్టార్స్‌ను కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలోకి లాగుతుంది. స్టార్స్‌గా వెలుగు వెలుగుతున్న వారు ఆడవారిని అంగడి బొమ్మలుగా చూసి, వారిని వాడేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా ఈ విషయమై కేసీర్‌ పట్టించుకోవాలని లేదంటే అర్థనగ్న ప్రదర్శణ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే శ్రీరెడ్డి ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శణ చేసి సంచలనం సృష్టించింది. ఆమె చేసిన పని కారణంగా జాతీయ మీడియాలో సైతం గుర్తింపు దక్కించుకుంది. శ్రీరెడ్డి గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.

గతంలో పలు సార్లు బాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడిన కంగనా రనౌత్‌ తాజాగా శ్రీరెడ్డికి మద్దతు పలికింది. అయితే శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమ తీరు బాగాలేదని చెప్పుకొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని పరిశ్రమల్లో కూడా ఆడవారు కాస్టింగ్‌ కౌచ్‌కు గురవుతున్నారని, దీనిపై తప్పకుండా అంతా పోరాడాల్సిన అవసరం ఉంది. కాని ఇలా నగ్న ప్రదర్శణలు చేయడం వల్ల శ్రీరెడ్డికి మద్దతుగా ఉండాలని భావించే వారు కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం మంచిదే కాని, ఆమె అవలంభిస్తున్న విధానంను సరిచేసుకోవాలంటూ కంగనా సూచించింది. నగ్న ప్రదర్శణ చేయడం వల్ల ఆమె చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టే అవకాశం ఉందని కంగనా పేర్కొంది. మరి ఇప్పటికైనా శ్రీరెడ్డి సరైన పద్దతిలో తన ఉద్యమాన్ని నడిపిస్తుందేమో చూడాలి.