మ‌హేశ్ బాబు హీరోయిన్ కు ధోనీతో డిన్న‌ర్ డేట్ క‌ల‌

actress Kiara Advani wants to go on dinner dateswith this cricketer dhoni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి సాధార‌ణ అభిమానులే కాదు… సెల‌బ్రిటీ అభిమానులూ చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ లో ఎంద‌రో హీరోయిన్లు ఫేవ‌రెట్ క్రికెట్ట ప్లేయ‌ర్ ఎవ‌రంటే ధోనీ పేరు చెప్తారు. ధోనీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ధోనీః ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన కైరా అద్వానీకి కూడా ధోనీనే ఇష్ట‌మైన క్రీడాకారుడు. సినిమాలో ధోనీ భార్య సాక్షి సింగ్ రావ‌త్ పాత్ర‌లో న‌టించిన కైరా… నిజ‌జీవితంలో ఆయ‌న‌తో క‌లిసి ఓ సారి డిన్న‌ర్ డేట్ కు వెళ్లాల‌నుకుంటోంది. ఈ విష‌యాన్ని ఓ క్రీడా చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కైరానే స్వ‌యంగా వెల్ల‌డించింది. అభిమాన క్రీడాకారుడు ఎవ‌రు? క‌్యాండిల్ లైట్ డిన్న‌ర్ డేట్ కు ఎవ‌రితో వెళ్లాల‌ని ఉంది అని అడిగిన‌ప్పుడు కైరా ఏమాత్రం త‌డుముకోకుండా ఈ స‌మాధానం ఇచ్చింది.

ధోనీ ఎందుకు త‌న‌కు అభిమాన క్రీడాకారుడో కూడా ఆమె వివ‌రించింది. త‌న కుటుంబ స‌భ్యుల గురించి ధోనీ ఎంతో కేర్ తీసుకుంటాడ‌ని, కూతురు జీవాను ఎంతో అపురూపంగా చూసుకుంటాడ‌ని కైరా తెలిపింది. హ‌ర్భ‌జ‌న్ సింగ్ రిసెప్ష‌న్ లో తానీ విష‌యాలను గ‌మ‌నించాన‌ని తెలిపింది. క్యాండిల్ లైట్ డిన్న‌ర్ డేట్ అంటే ఏమిటో త‌న‌కు తెలియ‌ద‌ని, కానీ మ‌హేంద్ర సింగ్ ధోనీతో డిన్న‌ర్ చేయాల‌ని ఉంద‌ని కైరా చెప్పింది. ధోనీ చూడ్డానికి ఎంతో నార్మ‌ల్ గా ఉంటాడ‌ని, అందుకే త‌న‌కు అత‌నంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. ధోనీ త‌ర్వాత అభిమాన క్రికెట‌ర్ అంటే విరాట్ కోహ్లీ చాలా హాట్ గా క‌నిపిస్తాడు అని న‌వ్వేసింది కైరా. ప్ర‌స్తుతం ఆమె టాలీవుడ్ లో భ‌ర‌త్ అను నేను చిత్రంలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. మొత్తానికి మ‌హేశ్ బాబు సినిమా హీరోయిన్ కు ధోనీ తో డిన్న‌ర్ కు వెళ్లాల‌న్న కోరిక ఉంద‌న్నమాట‌.