ఆర్‌ఎక్స్‌100 మరో 10 కోట్ల ఖాయం.. ఎందుకంటే!

rx 100 movie collections

కార్తికేయ, పాజల్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. మొదటి వారం రోజుల్లో దాదాపు 10 కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం రెండవ వారంలో కూడా జోరు కొనసాగించబోతుంది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లవర్‌’, ‘ఆటగదరా శివ’ చిత్రాలు మరియు ఇతర చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ప్రేక్షకులు ఇంకా కూడా ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఈ చిత్రం మరో వారం రోజుల పాటు తన జోరును కొనసాగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో దర్శకుడు విభిన్నమైన ప్రేమకథను చూపించడం జరిగింది. సహజంగా తెలుగు ప్రేక్షకులు నెగటివ్‌ క్లైమాక్స్‌ను అస్సలు ఒప్పుకోరు. కాని ఈ చిత్రంలో నెగటివ్‌ క్లైమాక్స్‌ ఉన్నా కూడా కథానుసారంగా అదే కరెక్ట్‌ అంటూ అంతా భావించి పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. మొత్తానికి ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం ఈ సంవత్సరం విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద చిత్రంగా నిలిచింది. చిన్న చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న, సాధించిన చిత్రంగా నిలవడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం ఏకంగా 25 కోట్ల మేరకు నిర్మాతకు తెచ్చి పెడుతుంది. ఇంత భారీ విజయం సాధించిన దర్శకుడు అజయ్‌ భూపతికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.