మెగా అల్లుడు రెండవ చిత్రం భారీ..!

kalyan dev Second movie budget update

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కళ్యాణ్‌ దేవ్‌ మొదటి సినిమాను చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించడం జరిగింది. సాయి కొర్రపాటి నిర్మాణంలో రాకేశ్‌ శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఒక మీడియా బడ్జెట్‌ చిత్రంతో రూపొందిన ఈ చిత్రం అనుకున్నదాని కంటే ఎక్కువగానే బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ‘విజేత’ చిత్రంతో నిర్మాత సాయి కొర్రపాటి విడుదలకు ముందే లాభాలను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకే కళ్యాణ్‌ దేవ్‌ రెండవ చిత్రాన్ని భారీగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కళ్యాణ్‌పై 25 నుండి 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినా కూడా నష్టం లేదని, సినిమా సాదా సీదాగా నడిచినా కూడా పెట్టుబడిని రాబట్టగలడు అనే ఉద్దేశ్యంతో పలువురు నిర్మాతలు ఈయనతో సినిమాను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

కళ్యాణ్‌ రెండవ సినిమాకు ఒక ప్రముఖ దర్శకుడు కథను సిద్దం చేస్తున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఒక నిర్మాత ఇప్పటికే కళ్యాణ్‌తో రెండవ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెల చివర్లో సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘విజేత’ సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా కూడా కళ్యాణ్‌ వరుసగా చిత్రాలను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవలే ‘విజేత’ ఆడియో విడుదల కార్యక్రమంలో కళ్యాణ్‌ మాట్లాడుతూ తనకు హీరోగా అవకాశాలు వరుసగా వస్తున్నాయని, వరుసగా చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇతర మెగా హీరోలతో పోల్చితే కళ్యాణ్‌ దేవ్‌కు మెగా ఫ్యాన్స్‌లో కాస్త తక్కువ క్రేజ్‌ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే మెగా ఫ్యాన్స్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలంటే కళ్యాణ్‌ చాలా కష్టపడాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.