చికాగో సెక్స్‌ రాకెట్‌కు శ్రీరెడ్డికి సంబంధం ఏంటీ?

sri reddy Talks About chicago sex racket

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న అమెరికా టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం గురించి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్స్‌ రాకెట్‌ బయటకు రావడంకు ప్రధాన కారణం తానే అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అమెరికా పోలీసులకు గత రెండు నెలలుగా తాను సహకరిస్తున్నాను అని, తన సహకారంతోనే పలు కీలక ఆధారాలను వారు కనిపెట్టారు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. హీరోయిన్స్‌తో పాటు పలువురు యాంకర్స్‌ మరియు ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లను తాను ఇచ్చాను అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. గత కొంత కాలంగా శ్రీరెడ్డి టాలీవుడ్‌ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చికాగో సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో కూడా స్పందింస్తుంది.

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలపై తనకు ఎలాంటి కోపం లేదని, అసలు తనకు అక్కడి తెలుగు సంఘాల వారి గురించి పూర్తిగా తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. కిషన్‌ నడుపుతున్న సెక్స్‌ రాకెట్‌కు మాత్రమే తాను వ్యతిరేకం అని, ఆడవారిని అంగడి బొమ్మలుగా చూసే అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను తాను కోరుతున్నట్లుగా ఈ సందర్బంగా శ్రీరెడ్డి డిమాండ్‌ చేసింది. తాను అమెరికా పోలీసులకు టచ్‌లో ఉన్నాను, వారు నా నుండి కావాల్సిన సమాచారంను తీసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకు చికాగో సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం శ్రీరెడ్డికి ఎలా తెలిసింది, ఆ విషయాలను అమెరికా పోలీసులకు శ్రీరెడ్డి ఎలా చెప్పిందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. శ్రీరెడ్డి ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్‌గా చేస్తుందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. శ్రీరెడ్డి ఏం చేసినా సంచలనాత్మకంగా ఉంటుంది. అలాగే ఇది కూడా అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. చికాగో సెక్స్‌ రాకెట్‌లో ఉన్న 30 మంది నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. వారి పేర్లను మాత్రం వెళ్లడి చేయను అంటూ పేర్కొని, అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.