చరణ్‌ కంటే ప్రభాస్‌ ఇంకాస్త వెనక్కు?

Prabhas Next Movie on Love Story Set In 1970

మెగా హీరో రామ్‌ చరణ్‌ ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమ్మర్‌ మొత్తం బాక్సాఫీస్‌ను దున్నేసిన ‘రంగస్థలం’ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌గా నిలిచిన విషయం తెల్సిందే. సినిమాలో 1980 కాలం నాటి పరిస్థితులను దర్శకుడు సుకుమార్‌ అద్బుతంగా చూపించిన విషయం తెల్సిందే. అప్పటి వస్తువు, టెక్నాలజీ అంతా కూడా అద్బుతంగా చూపించి ఆహా అనిపించాడు. అలాంటి ప్రయత్నమే ప్రస్తుతం ప్రభాస్‌తో దర్శకుడు రాధాకృష్ణ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

‘జిల్‌’ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ 1970 నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. 1970లో యూరప్‌ మరియు ఇండియాలో జరిగిన ఒక ప్రేమ కథను దర్శకుడు చూపించబోతున్నాడు. 1980 అంటేనే ఎన్నో విషయాలను ఈ తరంకు దర్శకుడు సుకుమార్‌ చూపించాడు. ఇక 1970 అంటే మరింత ఆసక్తికర విషయాలు చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ శాతం ఈ చిత్రాన్ని యూరప్‌లోనే చిత్రీకరించనున్నారు. యూరప్‌లో 1970 నేపథ్యంలో చిత్రాన్ని చేయడంతో పాటు, కొన్ని మోడ్రన్‌ డేస్‌ సీన్స్‌ను కూడా చేయబోతున్నారు. ఈ చిత్రం ఒక విభిన్నమైన ఫాంటసీ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.