తెలుగు బిగ్‌బాస్‌.. వినూత్న ప్రయోగం

Star MAA Doing New Experiment In Telugu Bigg Boss Season 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆధరణ దక్కించుకున్న బిగ్‌బాస్‌ను తెలుగులో కూడా గత సంవత్సరం తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. స్టార్‌ మాటీవీలో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ సీజన్‌ 1 కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేశాడు. మొదటి సీజన్‌ దుమ్ము దుమ్ముగా టీఆర్పీని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే సెకండ్‌ సీజన్‌ను మరింత ఆకట్టుకునే విధంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ కష్టమే అని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ స్థానంలో నానిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రెండవ సీజన్‌లో సాదారణ వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

స్టార్‌ మాటీవీ తాజాగా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో బిగ్‌బాస్‌ సీజన్‌ రెండులో సాదారణ వ్యక్తులకు కూడా ఛాన్స్‌ ఉందని, త్వరలోనే ఆ వివరాలను వెళ్లడి చేస్తామంటూ ప్రకటించారు. ఆ విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. మామూలుగా అయితే బిగ్‌బాస్‌లో కేవలం సెలబ్రెటీలను మాత్రమే ఎంపిక చేస్తారు. కాని బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం కొంత మంది సాదారణ వ్యక్తులను ఎంపిక చేసి ఇంటి లోపలకు పంపించబోతున్నారు. సెలబ్రెటీలు మరియు సాదారణ జనాలు కలిసి ఈ షోలో పాల్గొంటే ప్రేక్షకులు మరింతగా ఎంటర్‌టైన్‌ అవుతారు అంటూ నిర్వాహకులు భావిస్తున్నారు. జులై లేదా ఆగస్టులో బిగ్‌బాస్‌ 2వ సీజన్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆడిషన్స్‌కు పక్రియ మొదలు అయ్యింది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీల పేర్లను పరిశీలించడం జరిగింది. కొత్తగా ఉండబోతున్న బిగ్‌ బాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.