భానుశ్రీ ఎలిమినేషన్‌.. కారణం ఇదే

reason behind bhanusree eliminated from bigg boss house

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఈవారం భానుశ్రీ ఎలిమినేట్‌ అయ్యింది. ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో భానుశ్రీతో పాటు దీప్తి మరియు గణేష్‌లు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఖచ్చితంగా గణేష్‌ ఎలిమినేట్‌ అవుతాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా భానుశ్రీ ఎలిమినేట్‌ అవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఈ ముగ్గురిలో భానుశ్రీకి అతి తక్కువ ఓట్లు వచ్చినట్లుగా నాని ప్రకటించాడు. అత్యధికంగా గణేష్‌కు ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆరు కోట్ల ఓట్లలో గణేష్‌కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లుగా నాని చెప్పడం జరిగింది. భారీ ఎత్తున ఓట్లు పోల్‌ అయినప్పటికి గణేష్‌కు అత్యధిక ఓట్లు రావడంపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నుండి వెళ్లి పోయిన భానుశ్రీ అందరి హృదయాను గెలుచుకుంది. భానుశ్రీ ఇంటినుండి వెళ్లిన సమయంలో పలువురు ఇంటి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడు సందడి చేసే భాను వెళ్లి పోవడం ప్రేక్షకులకు కూడా కాస్త నిరాశే అని చెప్పుకోవచ్చు. ఇక భానుకు తక్కువ ఓట్లు పడటంకు కారణం ఆమె దుడుకు స్వభావం అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గత వారంలో కొన్ని సందర్బాల్లో భానుశ్రీ తన సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూ, ఇతరులను దూషిస్తూ వచ్చింది. దాంతో భానుపై అందరిలో కోపం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భాను శ్రీ చేసిన కొన్ని అతి ప్రవర్తన సంఘటనల వల్ల ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. కొన్ని సార్లు తప్ప ఎక్కువ సార్లు భాను మంచి హౌస్‌మెట్‌ అంటూ అంతా కూడా అంటున్నారు. ఇక వెళ్తూ వెళ్తూ భాను బిగ్‌బాంబ్‌ను అమిత్‌ మరియు కౌశల్‌పై విసిరేసింది. వారం మొత్తం కూడా అమిత్‌ ఒకే కుర్చీలో కూర్చోవాలి. ఆ కుర్చీని కౌశల్‌ వేస్తూ ఉండాలి అనేది బిగ్‌బాంబ్‌.