‘ఆర్‌ఎక్స్‌ 100’ నిర్మాతది మామూలు లక్‌ కాదు

rx 100 movie first weekend collections

కార్తికేయ మరియు పాయల్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనీసం మూడు కోట్లు కూడా పెట్టకుండా ఈ చిత్రాన్ని నిర్మాత నిర్మించాడు. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్‌ మద్య రొమాంటిక్‌ సీన్స్‌ ముఖ్యంగా ముద్దు సీన్స్‌ ఎక్కువగా ఉండటంతో సినిమాకు యూత్‌ ఆడియన్స్‌ నుండి విపరీతమైన ఆధరణ దక్కుతుంది. మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా ఆరు కోట్ల రూపాయల షేర్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సినిమాను నిర్మించిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున లాభాలు దక్కించుకుంటున్నారు.

సినిమాపై నమ్మకం లేకపోవడంతో శాటిలైట్‌ బిజినెస్‌ విడుదలకు ముందు కాలేదు. కాని ఇప్పుడు సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు రెండు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ పోటీ పడుతున్నాయి. ఆ రెండు ఛానెల్స్‌ కూడా అయిదు కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే నిర్మాత మాత్రం 6.5 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న కారణంగా నిర్మాత కోరుకున్న మొత్తం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు డబ్బింగ్‌ రైట్స్‌ మరియు రీమేక్‌ రైట్స్‌ను కూడా భారీ మొత్తానికి అమ్మేందుకు సిద్దం అయ్యాడు. కేవలం మూడు కోట్లు పెట్టిన నిర్మాతకు దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.