నేల టికెట్‌ కి పవన్ వస్తున్నాడు…

Director Kalyan Krishna Confirmed Pawan Kalyan Will Launch Nela Ticket Audio

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రవితేజ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్‌గా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేల టికెట్‌’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నేల టికెట్‌ టీజర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఈ చిత్రం ఆడియోను పవన్‌ కళ్యాణ్‌ చేతల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను మొదట చిత్ర నిర్మాతలు కొట్టి పారేశారు. పవన్‌ కళ్యాణ్‌ తమ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదని, గెస్ట్‌ ఎవరు అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానంటూ నిర్మాత పేర్కొన్నాడు. 

తాజాగా ‘నేల టికెట్‌’ చిత్రం ఆడియోను పవన్‌ కళ్యాణ్‌ ఆవిష్కరించబోతున్నట్లుగా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ప్రకటించాడు. తమ సినిమా ఆడియోను పవన్‌ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇది గొప్ప గౌరవం అంటూ దర్శకుడు కళ్యాణ్‌ ప్రకటించాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఈ నెల 10న భారీ ఎత్తున పవన్‌ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరపబోతున్నారు. పవన్‌ రాబోతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న సంగతి తెల్సిందే.