ఈగిల్ టీజర్ 7 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతోంది”.

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల టైగర్ నాగేశ్వర రావు చిత్రం తో ఆడియెన్స్ ముందుకి వచ్చిన రవితేజ, ఇప్పుడు ఈగిల్ అంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2024 లో థియేటర్ల లోకి రానున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార సినిమాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కి సంబందించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈగిల్ టీజర్ 7 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతోంది".
Eagle Movie

టీజర్ యూ ట్యూబ్ లో ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. 7 మిలియన్స్ వ్యూస్  తో దూసుకు పోతుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, అనుపమ పరమేశ్వరన్, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.