రాయలసీమ నేపథ్యంలో రవితేజ: మాస్ మహారాజు

రాయలసీమ నేపథ్యంలో రవితేజ: మాస్ మహారాజు
Cinema News

మాస్ మహారాజా రవితేజ హీరోగా డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ లు తీసి మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మలినేనితో రవితేజతో మరొక సినిమా చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. కాగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోందట. పైగా ఈ మూవీ కోసం రాయలసీమ మాండలికంలోనే రవితేజ డైలాగ్స్ చెప్పబోతున్నాడు. ఈ మూవీ లో కూడా రవితేజ డైలాగ్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తుంది . అలాగే సినిమాలో రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంట .

రాయలసీమ నేపథ్యంలో రవితేజ: మాస్ మహారాజు
Ravi Teja

ఇక ఈ సినిమా ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగిల్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.