“విక్రమార్కుడు 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Interesting update on “Vikramarkudu 2”!
Interesting update on “Vikramarkudu 2”!

కొన్ని మూవీ లు ఈ హీరో కోసం మాత్రమే అన్నట్టుగా పుట్టేవి కాస్త అరుదు గానే అనిపిస్తాయి. ఆ హీరో చేసాక అతనిలోని ఇంటెన్సిటీ ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పటికీ మరొకరు మ్యాచ్ చెయ్యలేని రేంజ్ లో ఖచ్చితంగా ప్రతి హీరోకి ఒక మూవీ ఉంటుంది. మరి అలాంటి మూవీ ల్లో మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మాసివ్ హిట్ మూవీ “విక్రమార్కుడు” కూడా ఒకటి.

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేసిన ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. ఇక రవితేజ మాస్ ఇమేజ్ ను కూడా ఆకాశానికి తీసుకెళ్లిన ఈ మూవీ కి తాను ప్రాణం పోసాడు. దీనితో ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఇలాంటి మూవీ కి పార్ట్ 2 అంటే కాస్త కష్టమైన పనే అని చెప్పాలి.

Interesting update on “Vikramarkudu 2”!
Interesting update on “Vikramarkudu 2”!

మొదటి మూవీ లోని సోల్ ను చెడగొట్టకుండా సీక్వెల్ చేసే సాహసం చాలా జాగ్రత్తగా చేయాలి. మరి దీనిపై నిర్మాత కేకే రాధా మోహన్ “భీమా” ప్రమోషన్స్ లో అసలు విక్రమార్కుడు 2 ఉందా లేదా అనే దానిపై సాలిడ్ అప్డేట్ అందించారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని అయితే ఈ మూవీ కి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపారు.

రవితేజ పార్ట్ 2 పై అంతగా ఆసక్తిగా లేరని కానీ తనని ఒప్పించే ప్రయత్నం తాను చేస్తున్నాను అని ఈ మూవీ కి కూడా కథ విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారు సంపత్ డైరెక్ట్ చేస్తాడని కన్ఫర్మ్ చేశారు. అయితే ఫైనల్ గా రవితేజ గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ మూవీ ని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆల్రెడీ “విక్రమార్కుడు 2” టైటిల్ రిజిస్టర్ కూడా చేయించానని తాను తెలిపారు.