ఈ సంక్రాంతికే మాస్ మహారాజ రవితేజ సినిమా ..

ఈ సంక్రాంతికే మాస్ మహారాజ రవితేజ..
Cinema

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా తో ఆడియెన్స్ ముందుకి వచ్చిన రవితేజ, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ బరిలో ఉన్నారు. “ఈగిల్ ” చిత్రం తో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం వాయిదా పడినట్లు వస్తున్న వార్తల పై మరోసారి క్లారిటీ వచ్చింది.

ఈ సంక్రాంతికే మాస్ మహారాజ రవితేజ..
Ravi Teja

అనుకున్న టైమ్ కే, అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2024 న సినిమాను వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా లో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.