Election Updates: తెలంగాణ ఎన్నికల బందోబస్తు ఖర్చు మాత్రమే రూ.150 కోట్లు!

Election Updates: Telangana election preparation cost only Rs.150 crores!
Election Updates: Telangana election preparation cost only Rs.150 crores!

తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న బందోబస్తు ఖర్చు మాత్రం బారెడవుతోందని అంచనా. ఈ ఎన్నికల్లో కేవలం బందోబస్తు ఖర్చు మాత్రమే రూ.150 కోట్లు అవుతుందోట. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బలగాలతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే రాష్ట్ర పోలీసుల భత్యాలు, వాహనాలకు అయ్యే ఖర్చు రూ.150 కోట్ల వరకు వస్తోందని టాక్. ఈ ఖర్చంతా రాష్ట్ర సర్కారే పెట్టుకోవాలి.

గత ఎన్నికల్లో మొత్తం రూ.100 కోట్లు కాగా ఇప్పుడు రూ.150 కోట్లకు చేరవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి… ఫలితాలు వెలువడే వరకూ పోలీసులు విధుల్లో ఉండాలసిందే. ఇక సరిహద్దుల్లో నిరంతరం తనిఖీలు కామన్. తనిఖీల కోసం అక్టోబరు 9 నుంచే రాష్ట్రంలో 373 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 374 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీంలు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పటికే కేంద్రం నుంచి 100 కంపెనీల పారామిలటరీ బలగాలు వచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్ర పోలీసు సిబ్బంది 60 వేల మంది వరకూ ఉండగా మరో 300 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరారు. ఇక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మరో 10వేల మంది వరకూ పోలీసులు వచ్చే అవకాశం ఉంది.