Election Updates: రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరనున్న వివేక్

Election Updates: Vivek will join Congress in the presence of Rahul Gandhi
Election Updates: Vivek will join Congress in the presence of Rahul Gandhi

బీజేపీకి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి రాజీనామా చేశారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్‌.. బీజేపీకి వెంకటస్వామి రాజీనామా చేశారు. కాసేపట్లో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు వివేక్. ఇవాళ, రేపు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగనుంది.

అయితే.. ఇప్పుడు హైదరాబాద్ లోని నోవా హోటల్‌ లో రాహుల్‌ గాంధీ ఉన్నారు. మరికాసేపట్లోనే.. రాహుల్‌ గాంధీని కలిసి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు వివేక్. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ కి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో…చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అయిందని సమాచారం. వివేక్ వెంకటస్వామి కోసం చెన్నూర్ స్థానాన్ని సిపిఐ కు ఇవ్వరాదని తాజాగా నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్‌.