నెం.10… చిరు అల్లుడు మూవీ షురూ

Chiranjeevi Son In Law Kalyan Dev Debut Film Launched today

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ నుండి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అయ్యింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ హీరోగా పరిచయం కాబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ సినిమాపై అధికారికంగా క్లారిటీ వచ్చింది. నేడు తెల్లవారు జామున సినిమాను చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. సాయి కొర్రపాటి నిర్మాణంలో రాకేష్‌ శశి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్‌ నటించబోతుంది. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతుందని, త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా నిర్మాత సాయి కొర్రపాటి చెప్పుకొచ్చాడు.

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌ తేజ్‌, నాగబాబు, నిహారికలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు నెం.10గా కళ్యాణ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన 9వ హీరోగా, 10వ వ్యక్తిగా కళ్యాణ్‌ నిలిచాడు. ఒక ఫ్యామిలీ నుండి ఇంత మంది స్టార్స్‌ రావడం రికార్డుగా చెప్పుకోవచ్చు. త్వరలోనే సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరంగా ఉంటుండగా, నాగబాబు అప్పుడప్పుడు కనిపిస్తూ పోతున్నాడు. మొత్తానికి మెగా స్టార్‌ అల్లుడు అయినందుకు కళ్యాణ్‌కు హీరోగా మంచి ఎంట్రీ దక్కబోతుంది. ఇదే సంవత్సరంలో కళ్యాణ్‌ మొదటి సినిమా విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. మంచి కథలను ఎంపిక చేసే సత్తా ఉన్న నిర్మాత సాయి కొర్రపాటిపై నమ్మకంతో చిరంజీవి ఈ బాధ్యతను ఆయనకు అప్పగించాడు.