స్మార్ట్ సైకిల్ తొక్కిన చంద్రబాబు.

Smart Cycle System was launched by Chief Minister Chandrababu.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వయసు 68 . మోకాళ్లనొప్పులతో అమ్మాఅబ్బా అనాల్సిన ఈ సమయంలో చంద్రబాబు సైకిల్ తొక్కారు. పాత తరం నాయకుడు కదా ఏదో ఎత్తుగా వుండే సైకిల్ తొక్కారు అనుకుంటారేమో. కానే కాదు . ఈ తరం కుర్రకారు వాడే స్మార్ట్ సైకిల్ అవలీలగా తొక్కేశారు. ఇంతకీ సందర్భం ఏంటనేగా మీ డౌట్ .

అమరావతి, సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఉద్యోగులు ,సందర్శకులు, ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండేలా మొత్తం 24 స్మార్ట్ సైకిల్స్ ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అమరావతిలో పొగరహిత వాతావరణం పెంపొందించడానికి వీలుగా ఈ స్మార్ట్ సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొనుగోలు చేసిన ఈ ఒక్కో సైకిల్ ధర లక్ష రూపాయలు. ఈ సైకిల్స్ ని పెట్టుకోడానికి మూడు షెల్టర్లు , వినియోగానికి crda పరిధిలో ప్రత్యేక ట్రాక్స్ కూడా రెడీ చేస్తున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం కోసం వచ్చిన చంద్రబాబు కుర్రోడిలా కాసేపు స్మార్ట్ సైకిల్ తొక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.