మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ

Mega Family at Chiranjeevi Daughter Sushmita Birthday Celebrations

Posted March 13, 2018 (2 weeks ago) at 12:35 
మెగా ఫ్యామిలీ హీరోలు అంతా ఒక్కచోట చేరితే మెగా ఫ్యాన్స్‌కు అంతకు మించిన పండగేం లేదు. అలాంటి సంఘటనే జరిగింది. చిరంజీవి, రామ్‌ చరణ్‌ మినహా మిగిలిన అందరు మెగా హీరోలు ఒక్కచోట చేరి సందడి చేశారు. తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పుట్టిన రోజు వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అంతా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ స్క్రీన్‌ను షేక్‌ చేస్తున్న హీరోల నుండి రాబోయే కాలంలో హీరోలుగా వెలుగు వెలగబోతున్న వారు కూడా ఈ ఫొటోలో సందడి చేశారు.

అల్లు అరవింద్‌ పెద్ద కొడుకు తీసిన ఈ సెల్ఫీలో అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, కళ్యాణ్‌, నిహారిక, సుష్మిత ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ ఉన్నారు. చాలా కాలం తర్వాత మెగా హీరోలు అంతా కూడా ఒక్క ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి సందర్బంలో చిరంజీవి, పవన్‌, రామ్‌ చరణ్‌లు కూడా ఉంటే బాగుండేదని, పవన్‌ ఎలాగు రాడు కనుక చిరు, చరణ్‌లు కూడా ఈ ఫొటోలో ఉంటే మరింత కల ఉండేది అంటూ మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెగా హీరోలు ఎంత బిజీగా ఉన్నా కూడా తమ కుటుంబంలో ఏ చిన్న వేడుక అయినా కూడా అంతా ఒక్కచోట చేరే ఆనవాయితి చాలా కాలంగా వస్తూనే ఉంది. ఇప్పుడు సుష్మిత పుట్టిన రోజు కోసం అంతా కలిశారు.

SHARE