ఇంతకు నిజమా? కాదా?

Mahanati Team Angry On Leak of ANR Role

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సావిత్రి జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌ రోల్‌ను కీర్తి సురేష్‌ పోషిస్తుండగా, సమంత ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సమయంలోనే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి నాగచైతన్య ఈ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను పోషిస్తున్నాడు అంటూ తెలియజేశారు. దాంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడటం జరిగింది.

మీడియాలో ఏయన్నార్‌ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిషయాన్ని సినిమా విడుదల వరకు సీక్రెట్‌గా ఉంచాలని భావించారు. కాని రివీల్‌ అవ్వడంతో నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. ఈ లీక్‌కు కారణం అయిన వారిపై దర్శకుడు మరియు నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇంతకు నాగచైతన్య ‘మహానటి’లో ఉన్నాడా లేడా అనే విషయంపై మళ్లీ అనుమానాలు మొదలు అయ్యాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఈ విషయాన్ని నిర్ధారించని కారణంగా ఈ అనుమానాలు వస్తున్నాయి. ఒక వేళ నాగచైతన్య ఏయన్నార్‌ పాత్రను చేస్తుంటే, ఎన్టీఆర్‌ పాత్రను చేసేది ఎవరు అంటూ అందరిలో ఆసక్తి నెలకొంది.