ఉగాదికి సందడి లేనట్లే

Tollywood Movies release on Ugadi Festival

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు వారి ఏ పండుగ అయినా టాలీవుడ్‌ సినిమాల సందడితో రెట్టింపు అవుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి పండుగకు స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఇలా ముఖ్యమైన పండుగలకు పెద్ద ఎత్తున స్టార్‌ హీరోల సినిమాలు వస్తూ ఉంటాయి. కాని ఈసారి మాత్రం ఉగాదికి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద సందడి కనిపించే అవకాశం లేదు. పరీక్షల సీజన్‌ అవ్వడంతో ఈ ఉగాదికి పెద్ద హీరోల సినిమాలను విడుదల చేయడం లేదు. ఈనెల 18వ తారీకున ఉగాది పండుగ కాగా, అంతకు రెండు రోజుల ముందే అంటే ఈనెల 16న మూడు నాలుగు చిన్న చితకా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఉగాది కానుకగా స్టార్‌ హీరోల సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ పడినది లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒకటి రెండు జస్ట్‌ ఓకే సినిమాలు తప్ప ఇప్పటి వరకు సూపర్‌ అనిపించుకున్న సినిమాలు రాలేదు. దాంతో ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉగాదికి లేక పోయినా ఈనెల చివరి నుండి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కళకళలాడబోతుంది. పెద్ద సినిమాలు క్యూ కట్టి మరీ రాబోతున్నాయి. ఉగాదికి విడుదల కాబోతున్న చిత్రాల్లో ‘కిర్రాక్‌ పార్టీ’ కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుండగా మిగిలిన చిత్రాలు సోదిగానే ఉండబోతున్నాయి. ఉగాది పండగ పరీక్షల సీజన్‌ కారణంగా వృదా కాబోతుంది.