రంగస్థలం’కు పవన్‌… నిజమా?

Pawan Kalyan may Attends Rangasthalam Pre-release event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రంగస్థలం’. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయి. ఈనెల 18న మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక జరుగబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా వెళ్లడి చేశారు.

ఇక సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ మరియు కొందరు ఔత్సాహికులు ఈ వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనబోతున్నట్లుగా చెబుతున్నారు. పవన్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటే అన్ని విధాలుగా మేలు అనే ఉద్దేశ్యంతో పవన్‌ ఈ వేడుకలో పాల్గొనాలి అనే నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చింది. పవన్‌ ఈ వేడుకలో హాజరు కాబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు పవన్‌కు ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానమే అందలేదు అని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యాన్స్‌ మాత్రం పవన్‌ హాజరు అయితే బాగుండేది అంటున్నారు.