తెలుగు తెరపై మళ్లీ అక్కినేని ఇంటి అమ్మాయి…

Akkineni Supriya Re entry in movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దక్షిణాదిన సినీ కుటుంబాల నుంచి హీరోలు బయటకు రావడం ఎంతో సహజం. అదే కుటుంబాల ఆడపడుచులు తెరపై కనిపించడం బహు అరుదు. ఇప్పుడు ఆ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు బయటకు రావడం కామన్ అయిపోయింది గానీ అప్పట్లో అది మామూలు విషయం కాదు. అలాంటి టైం లో అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయి, మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న అబ్బాయి సరసన హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ అమ్మాయి -ఇక్కడ అబ్బాయి. ఆ హీరో పవన్ కళ్యాణ్. ఆ హీరోయిన్ సుప్రియ. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు. హీరో సుమంత్ సోదరి కూడా. ఆ సుప్రియ తర్వాత నటనకు గుడ్ బై కొట్టి అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి తర్వాత 21 ఏళ్లకు సుప్రియ మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారట. హీరో అడవి శేష్ డైరెక్ట్ చేస్తున్న గూఢచారి సినిమాలో సుప్రియ ఓ ముఖ్యమైన పాత్ర చేయబోతున్నారట. మొదట్లో సుప్రియ పెద్ద ఆసక్తి చూపకపోయినా అడవి శేష్ పట్టుబట్టి ఆమెను ఆ పాత్రకు ఒప్పించినట్టు తెలుస్తోంది. సుప్రియ నటించడం ఈ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది పక్కనబెడితే అక్కినేని మనవరాలు మళ్లీ తెరపై కనిపించడం మాత్రం విశేషమే.