సక్సెస్‌ క్రెడిట్‌లో 90% ఆయనదే

http://telugubullet.com/wp-content/uploads/2017/06/ami-tumi-movie-success-cred-1.jpg
  • పలు విభిన్న తరహా కథా చిత్రాలను అందించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఎందిన మోహనకృష్ణ ఇంద్రగంటి తాజాగా అవసరాల శ్రీనివాస్‌, అడవి శేషులు హీరోలుగా అమీతుమీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ఈ ఇద్దరు హీరోల కంటే వెన్నెల కిషోర్‌ పోషించిన పాత్ర బాగుందని, ఆయన కామెడీతో అదరగొట్టాడు అనే టాక్‌ వినిపిస్తుంది. విమర్శకులు కూడా వెన్నెల కిషోర్‌ కామెడీకి ఫుల్‌ మార్కులు వేస్తున్నారు. ఇక సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది అంటే సగంకు పైగా ఎక్కువ కారణం వెన్నెల కిషోర్‌ కామెడీ అనే మాట చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం ఒప్పుకుంటున్నారు.

అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ప్రస్తుతం బాక్సాపీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. పెట్టిన పెట్టుబడికి, వస్తున్న కలెక్షన్స్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ఈ చిత్రంతో నిర్మాతకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురుస్తుంది. ఇంత భారీ విజయం కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ వల్ల అంటూ నెటిజన్స్‌ అంటున్నారు. చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ప్రస్తుతం సినిమాకు వస్తున్న కలెక్షన్స్‌కు 90 శాతం కారణం వెన్నెల కిషోర్‌ అంటున్నారు. మొత్తానికి తనవల్ల ఒక సినిమా ఆడుతున్నందుకు ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ కమెడియన్‌గా ఉన్నాడు. ‘అమీతుమీ’ వల్ల ఆ క్రేజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.