డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ను భయపెడుతున్న సింగం

akun sabarwal shivers tollywood drugs maphia

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Akun Sabarwal Is Making Tollywood Shiver In Drugs Case

హైదరాబాద్ లో డ్రగ్స్ ను విచ్చలవిడిగా అలవాటుచేసుకున్న సినిమా సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ చుక్కలు చూపెడుతోంది. ఇప్పటికే పన్నెండు మందికి నోటీసులిచ్చిన అధికారులు.. సెకండ్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. డ్రగ్స్ డీలర్ కెల్విన్ నుంచి కీలక సమాచారంతో పాటు ఆధారాలు కూడా రాబట్టిన ఎక్సైజ్ సిబ్బంది ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు.

దీనికి తోడు మొన్నటివరకూ లీవ్ పై వెళ్లిన అకున్ సభర్వాల్.. లీవ్ కేన్సిల్ చేసుకుని మళ్లీ విధుల్లో చేరడంతో.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొందరు సినీపెద్దలు ఒత్తిడి తెచ్చి అకున్ సభర్వాల్ ను ట్రాన్స్ ఫర్ చేయించారని ఇఫ్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే సీఎంఓ నుంచి ఫోన్ చేసి మరీ అకున్ ను ఇమిడియట్ గా జాయిన్ కావాలని చెప్పారు.

ఇప్పటికే అకున్ సభర్వాల్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, డ్రగ్స్ కేసులో ఫుల్ పవర్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అకున్ నిజాయితీపరుడు కాబట్టి.. పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో అకున్ కు సీఎం భరోసా లభించిందనే ప్రచారం జోరందుకుంది. ఈ దెబ్బతో అకున్ పెద్ద తలకాయల పేర్లు కూడా బయటకు తెస్తారని టాలీవుడ్ షేకైపోతోంది.