మహేష్‌25పై అల్లరోడు క్లారిటీ

Allari Naresh Gives Clarity On Mahesh Babu 25th Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన భరత్‌ చిత్రం తర్వాత మహేష్‌బాబు సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో పాటు ఈ చిత్రం మహేష్‌కు 25వ చిత్రం అవ్వడం వల్ల కూడా అందరిలో ఆసక్తి తారా స్థాయిలో ఉంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు వంశీపైడిపల్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి గత ఆరు నెలలుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌కు డేట్‌ పిక్స్‌ అయ్యింది. జూన్‌ రెండవ వారం నుండి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ పాత్రపై క్లారిటీ వచ్చింది.

మహేష్‌బాబు 25వ చిత్రంలో అల్లరి నరేష్‌ ఒక గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. కాని ఆ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా అల్లరి నరేష్‌ స్వయంగా తాను మహేష్‌ 25వ చిత్రంలో నటించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. అది కూడా చిన్న గెస్ట్‌ రోల్‌ కాదని, ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ అంటూ చెప్పుకొచ్చాడు. మొదటి సగంలో కామెడీతో ఎంటర్‌టైన్‌ చేయనున్నాను, సెకండ్‌ హాఫ్‌లో కాస్త ఎమోషనల్‌ సీన్స్‌ ఉంటాయి అంటూ అ్లరోడు చెప్పుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లరోడి పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణ అంటూ దర్శకుడు చెబుతున్నాడు. దిల్‌రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఇదే సంవత్సరంలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.