పుష్ప-3 పార్ట్ కూడా ఉందని ప్రకటించిన అల్లు అర్జున్

పుష్ప-3 పార్ట్ కూడా ఉందని ప్రకటించిన అల్లు అర్జున్
Cinema News

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ పుష్ప-2 . ఈ మూవీ లో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ కి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో కీలకమైన సుదీర్ఘ షెడ్యూల్ చిత్రీకరణ కోసం జపాన్ వెళ్లనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

పుష్ప-3  పార్ట్ కూడా ఉందని ప్రకటించిన అల్లు అర్జున్
Pushpa Part -3

ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కే విడుదల చేయాలని అల్లు అర్జున్ హుకుం జారీ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా, జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ సినీ ప్రాముఖ్యత గురించి బన్నీ మాట్లాడారు. అనంతరం ఒక ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ తో పుష్ప-2 మూవీ గురించి చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్ కంటే రెండోది అద్భుతంగా ఉంటుంది. మీరు మూడో పార్ట్ ను కూడా ఆశించవచ్చు. దీనిని ఫ్రాంచైజీగా మార్చాలని అనుకుంటున్నాం అని చెప్పారు.