పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంపై అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ ….!

Allu Arjun's special tweet on Pawan Kalyan's win in Pithapuram....!
Allu Arjun's special tweet on Pawan Kalyan's win in Pithapuram....!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం లో భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు శాతం పెంచుకున్న జనసేనాని.. ఈసారి ఏపీ అసెంబ్లీలోకు అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ విజయంపై ఇటీవల అల్లు అర్జున్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Allu Arjun's special tweet on Pawan Kalyan's win in Pithapuram....!
Allu Arjun’s special tweet on Pawan Kalyan’s win in Pithapuram….!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు కూడా తెలిపారు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకి సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు .