క్రిష్ ‘అహం బ్రహ్మష్మి’ హీరో ఎవరో తెలుసా?

Allu Arjun in Krish Aham Brahmashmi movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ హీరో బన్ని ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం బన్ని దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మణికర్ణిక చిత్రాన్ని చేస్తున్న క్రిష్ ఆ సినిమా తర్వాత ఇప్పటికే సిద్దం చేసుకున్న అహం బ్రహ్మష్మి కథతో బన్నీ హీరోగా ఒక చిత్రం చేస్తాడట.

త్వరలోనే ఆ షూటింగ్ మొదలుపెడతాడనే వార్తలు వస్తున్నప్పటికీ, కొందరు మాత్రం ఈ వార్తల్లో నిజం ఏమిటో! అబద్దం ఏమిటో! త్వరలోనే తెలియనుందని అంటున్నారు. బన్ని గతంలో క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. క్రిష్ టేకింగ్ అంటే బన్ని కి బాగా ఇష్టం అందువలన బన్నితో క్రిష్ సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వేల ఈ సినిమా కన్ఫర్మ్ అయితే సంచలనం నమోదు అవ్వడం ఖాయం అంటున్నారు.