క్లైమాక్స్ కి జయ కేసు విచారణ, అపోలో ప్రతాప రెడ్డి కి సమన్లు

notices gets to Apollo Prathap Reddy over Jayalalitha Death case

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళనాడు దిగవంత ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాదిన్నర కావస్తున్నా ఆమె మరణం మీద ఉన్న అనుమానాలు తీర లేదు. ఆమె మృతి పై నెలకొన్న సందేహాల్ని తీర్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్‌ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. జయలలిత మరణం వెనుకున్న మిస్టరీని సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు విచారణను వేగవంతం చేస్తూ, పలు కోణాల్లో ఎంక్వయిరీ సాగిస్తున్న కమిషన్, ఇప్పటికే, జయకు సన్నిహితంగా ఉండే పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించింది.

తాజాగా జయకు వైద్యం అందించిన అపోలో గ్రూపు ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి సమన్లు జారీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. విచారణకు రావాలని ఆదేశాలు ఇస్తూ, అందుకు వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఆమెకు అందించిన చికిత్స, చేసిన వైద్య పరీక్షలు తదితరాలపై సమాచారం కోసం ఇప్పటికే అపోలో హాస్పిటల్ కు సమన్లు పంపింది. ఇప్పటికే ఈ సమన్లకు అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆసుపత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్‌ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. సమన్లు అందుకున్న వారం రోజుల్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. జయలలిత మరణంపై ఉన్న అనుమానాల్ని తీర్చేందుకు అపోలో రెడ్డి సమాధానాలు చాలా కీలకంగా ఉండనున్నాయని అధికారులు భావిస్తున్నారు.