మ‌హాన్యూస్ ను ఏమ‌న్నా అంటే అంద‌రి జాత‌కాలూ బ‌య‌ట‌పెడ‌తా… శ్రీరెడ్డి హెచ్చ‌రిక‌

sri reddy warnings on netizens about mahaanews issue

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హైద‌రాబాద్ ఫిలింన‌గర్ లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ముందు శ్రీరెడ్డి చేసిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆమె క‌న్నా ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు పాల‌యింది న్యూస్ చాన‌ళ్లు. ముఖ్యంగా ఆమె అర్ధ‌నగ్నంగా ఉన్న‌ప్పుడు ఆమె శ‌రీరంపై దుస్తులు కూడా క‌ప్పే ప్ర‌య‌ద్న్ చేయ‌కుండా…ఆమె ఇంట‌ర్వ్యూను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన మ‌హాన్యూస్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. టీఆర్ పీ రేటింగ్స్ కోసం మ‌హాన్యూస్ జ‌ర్న‌లిజాన్ని దారుణంగా దిగ‌జార్చింద‌ని పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌యింది. ఆ ఘ‌ట‌న‌లో శ్రీరెడ్డి వ‌లువ‌ల‌ను, మ‌హాన్యూస్ విలువ‌ల‌ను వ‌దిలేసింద‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. శ్రీరెడ్డి నిర‌స‌న జ‌రిగి మూడు రోజులు దాటినా..ఈ టాపిక్ ఇంకా వార్త‌ల్లో న‌లుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో శ్రీరెడ్డి స్పందించింది.

త‌న నిర‌స‌న‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన తెలుగు న్యూస్ చాన‌ల్స్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై మండిప‌డింది. ఈ మేర‌కు ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మ‌హాన్యూస్ ను ఆమె స‌మ‌ర్థించింది. ఆ చాన‌ల్ త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని చెప్పింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయాల‌కు సంబంధించి అన్ని వీడియో సాక్ష్యాలు మ‌హాటీవీకి అందించిన త‌ర్వాతే ఆ చాన‌ల్ త‌న స‌మ‌స్య‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డించేందుకు ముందుకు వ‌చ్చింద‌ని శ్రీరెడ్డి తెలిపింది. త‌న‌ను హ‌త్య‌చేస్తార‌ని భ‌యంగా ఉంద‌ని, త‌న‌కేదైనా జ‌రిగితే అంద‌రి పేర్లూ బుల్లితెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయ‌నిహోచ్చ‌రించింది. తాను వైసీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నానంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌లు స‌రైన‌వి కాద‌ని, తాను రెండున్న‌రేళ్ల‌పాటు సాక్షి టీవీ ఉప్పుతిన్నాన‌ని, ఆ చాన‌ల్ త‌న‌కు అన్నంపెట్టింద‌ని, అటువంటి చాన‌ల్ ను, యాజ‌మాన్యాన్ని అప‌ఖ్యాతి పాలు చేసేంత విశ్వాసంలేని దాన్ని కాద‌ని వ్యాఖ్యానించింది. తాను టీడీపీతో కుమ్మ‌క్కు కాలేద‌ని, త‌న‌కు రాజ‌కీయ‌పార్టీల‌తో లాలూచీ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంచేసింది. త‌న పోరాటానికి మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసింద‌ని, అటువంటి మీడియాపై నింద‌లేస్తే అంద‌రి జాత‌కాల‌నూ బ‌య‌ట‌పెడ‌తాన‌ని శ్రీరెడ్డి హెచ్చ‌రించింది.