శిఖా చౌదరికి శ్రీ రెడ్డి మద్దతు !

Sri Reddy Supports Shikha Chowdary

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రముఖ వ్యాపార వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు విషయంలో సంచలన కామెంట్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈ హత్య కేసులో అనేక అనుమానాల నేపథ్యంలో జయరాం మేనకోడలు శిఖా చౌదరిపై పలు ఆరోపణలు వచ్చాయి. సంచలనం రేపిన ఈ మర్డర్ మీద శ్రీరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి మద్దతుగా నిలిచి హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో సంచలనం రేపిన ఈ నటి ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. గత కొంతకాలంగా అక్కడే ఉంటున్న శ్రీరెడ్డి సడన్‌ గా హైదరాబాద్‌లో దర్శనం ఇచ్చింది. ముఖానికి ముసుగు ధరించి ఎవరికీ కనిపించకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో హల్ చేసింది. ఇక జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి మద్దతుగా నిలుస్తూ పోస్ట్ పెట్టింది. ‘జయరాం హత్య కేసులో నిజా నిజాలు తెలుసుకోకుండా శిఖా చౌదరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు శిఖా చౌదరి ఈ మర్డర్ చేసిందని నేను నమ్మడం లేదు. ఈ కేసులో ఆమె అనుమానితురాలు కూడా కాదంటూ సంచలన పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.