జనసేన పార్టీ గుర్తుపై శ్రీ రెడ్డి కామెంట్స్…

Sri Reddy Comments on Janasena Party Symbol

టాలీవుడ్ లో కొంత మంది ఫేమస్ అవ్వడానికి ఎన్ని రకాల దారులు ఉంటాయో అన్ని రకాల దారులు వెతుకుతారు. అందులో ఆ మద్య కొంత మంది భాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఒక్కరు కత్తి మహేష్ బిగ్ బాస్ కు ముందు ఇతను ఎవరో తెలియదు. బిగ్ బాస్ తరువాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ భాగా పేరు సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ నిషేధానికి గురై సిటీ వదిలి బెంగళూర్ కు మకాం మార్చాడు. ఆ గొడవ ముగిసిన కొద్ది రోజులకు మరొకరు వచ్చారు సారీ వచ్చింది ఆమె శ్రీ రెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ భాగా ఉన్నదని ఆమె ఉద్యమానికి తెరలేపింది. సోషల్ మీడియాలో ఐకాన్ గా నిలిచింది. టాలీవుడ్ ప్రముఖలను టార్గెట్ చేస్తూ, వాళ్ల ఫొటోస్ ను పబ్లిక్ లో బయటపెట్టింది. దీంతో టాలీవుడ్ మొత్తం షాక్, ఇంకా ఉద్యమాని మరింత ఉదృతం చెయ్యాలని భాగా టాలీవుడ్ లో పేరు ఉన్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టింది. అటు పవన్ కళ్యాణ్ కోపానికి… ఇటు పవన్ ఫాన్స్ ఆగ్రహానికి గురై సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ దెబ్బకు తల పట్టుకుంది. ఆ తరువాత ఆమె టాలీవుడ్ నుండి కోలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ ఆమె తిన్నగా ఉన్నది అంటే అది లేదు. తమిళ ప్రముఖ దర్శకుడు మురగదాస్ ను టార్గెట్ చేసింది . ఇక కోలీవుడ్ హీరోస్ కూడా శ్రీ రెడ్డి తో జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఓ సినిమాలో నటిస్తూ ఉన్నది. శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ గొడవ సద్దుమణిగింది అనుకున్నా సమయంలో మరో సరి పవన్ పార్టీ గుర్తు పైన కామెంట్స్ చేసింది.

sri reddy

పవన్ కు రీసెంట్ గా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ గాజు గ్లాస్ పై శ్రీ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసింది. ఏమని అంటే బీర్ గ్లాస్….వైన్ గ్లాస్….స్కాచ్ గ్లాస్…. అంటూ కామెంట్స్ చేసింది. అదే నేపద్యంలో మెగా బ్రదర్ నాగ బాబు పైన కూడా కామెంట్స్ చేసింది. నాగ బాబు కు కొత్తగా గొంతు వచ్చింది. బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ మాట్లాడటం సరికాదు… నాగబాబు కు కూడా ఓ గ్లాస్ ఇవండర్రా అంటూ సటైరు వేసింది. పవన్ ఫాన్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ శ్రీ రెడ్డి పై చాలా ఆగ్రహం తో ఉన్నారు. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి ని ఎకిపికి పారేస్తున్నారు. శ్రీ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గకుండా పవన్ ఫాన్స్ కు ఘాటుగా సమాధానం ఇస్తుంది. శ్రీ రెడ్డి మాత్రం పవన్ టార్గెట్ చేస్తూనే ఉన్నది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడో అంటున్నారు జనాలు.