చిరు గెస్ట్ గా వినయ విధేయ రామ…!

Chiranjeevi Attend For Vinaya Vidheya Rama Pre Release Event

రామ్ చరణ్ హీరోగా మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం వినయ విధేయ రామ ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇకా ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ అండ్ ఫస్ట్ లుక్ కు మెగా ఫాన్స్ అండ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇకా ఈ చిత్రం నుండి మెగా ఫాన్స్ కు భాకి ఉన్నవి మూడు మాత్రమే ఒక్కటి ఆడియో ఫంక్షన్ రెండు ట్రైలర్ ఈ రెండింటిని వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు విడుదల చేస్తారు అదికూడా ఎంతో దూరంలో లేదు డిసెంబర్ 27 న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ లైన్ గ్రౌండ్స్ లోని ఏర్పాటుకు సిద్దం చేస్తున్నారు చిత్ర బృందం ప్రస్తుతం అక్కడ ఆడియో వేడుకకు సంబందించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధి గా మెగా స్టార్ చిరంజీవి వస్తున్నారు.

ఆ రోజు ఆడియో అండ్ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తారు అలాగే ఈ సినిమా దర్శకుడు బోయ్యపాటి శ్రీను కు నిర్మాతకు, చరణ్ కు చిన్న చిన్న వివాదాలు ఉన్నట్లు చిత్రా వర్గాల ద్వార తెలుస్తుంది. వీటికి అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చరణ్ భావిస్తున్నాడు. ఇకా ముడోవధి సినిమా రిలీజ్ అది వచ్చే ఏడాది జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన భరత్ అనే నేను మూవీ ఫేం కియార అద్వాని నటిస్తోంది. అలాగే ఆర్యన్ రాజేష్ ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.