దుబాయ్ చెక్కేసిన ఎన్టీఆర్…అందుకేనట !

NTR Going Dubai For RRR

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ లో ఎన్టీఆర్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ కి సంబందించిన భాగం షూట్ అవుతుండగా ఎన్టీఆర్ కి కొద్ది రోజులు బ్రేక్ దొరికిందట. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావడంతో యంగ్ టైగర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు. అయితే అక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండూ చక్కబెడుతున్నాడని సమాచారం. అదేంటా అనుకుంటున్నారా అక్కడే ఒక వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు కావల్సిన కొంత షాపింగ్ చేయడంతో పాటు కాస్త ఫైట్ లలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాడట. ఈ నెలాఖరు వరకూ తారక్ దుబాయ్‌లోనే ఉంటాడని సమాచారం.