మజిలీ టీజర్ టాక్ : వెధవలకి మంచి పెళ్ళాలే దొరుకుతారు !

MAJILI Movie Teaser

వివాహబంధంతో ఒక్కటైన తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో నీకో సంవ‌త్స‌రం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం అని రావు ర‌మేష్ చెప్పే డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది.

పెళ్లయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘మజిలీ’పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ఒక్కసారి పోతే తిరిగి రాదురా.. అది వస్తువైనా, మనిషైనా, నువ్వు నా రూమ్‌లోకి రాగలవేమో గానీ.. నా మనసులోకి మాత్రం ఎప్పటికీ రాలేవు, వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో నాగచైతన్యకు లవ్ ఫెయిల్యూర్ అయినట్లు అనిపిస్తోంది. ఇష్టం లేని భార్యతో కాపురం చేసే వ్యక్తిగా, భర్త పట్టించుకోకపోయినా అతడిపై సముద్రమంత ప్రేమ చూపించే అమాయక భార్యగా సమంత బాగా నటించారు. మరో హీరోయిన్ దివ్యాంశా కౌశిక్‌తో నాగచైతన్య లిప్‌లాక్ టీజర్‌కే హైలెట్. క్రికెటర్‌గా చై చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ‘నిన్నుకోరి’ లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజిలీ’. చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయ‌నున్నారు.