జయరాం హత్య కేసులో నటుడు !

Actor Ping Pong Surya Involved in Jayaram Murder Case

కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు రాకేశ్‌ ‌రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్‌ లను కోర్టు అనుమతితో మూడు రోజులపాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారించారు. జయరాంను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రాకేశ్ రెడ్డి తన కారులోనే ఉంచుకుని 5 గంటలపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లు విచారణలో వెల్లడించాడు. మృతదేహాన్ని నందిగామ తరలించే వరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు, నల్లకుంట ఎస్ఐ శ్రీనివాస్‌తో 13 సార్లు రాకేశ్ రెడ్డి మాట్లాడినట్లు కాల్‌డేటా విశ్లేషణలో వెల్లడయ్యింది. జయరాంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఏసీపీ, ఎస్ఐ సలహాలు తీసుకున్నట్లు వెల్లడయ్యింది. తాజాగా, ఈ హత్య కేసులో ‘ఆ నలుగురు’ నటుడు పింగ్ పాంగ్ సూర్య అలియాస్ సూర్య ప్రసాద్‌ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్ రెడ్డికి సూర్య స్నేహితుడు కావడం, హత్యకు ముందు అతడితో ఫోన్లో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఈ కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు, హత్య జరిగిన రోజున రాకేశ్ ఇంటికి సూర్య వచ్చి వెళ్లినట్టు రూడీ కావడంతో ర్యను పిలిపించిన బంజారాహిల్స్ పోలీసులు అతడిని విచారించారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న మరికొందరిని గురువారం విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.