జగన్‌పై దాడి ట్వీట్‌… శ్రీరెడ్డికి షాక్‌…!

Srireddy Comments About Kollywood Stars

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ పట్ల పలువురిపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఒక స్థాయిలో ఉద్యమం అంటూ నానా రచ్చ చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత పవన్‌ను విమర్శించడంతో అంతా ఆమెను సైడ్‌ చేశారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కోడి పందెంలకు ఉపయోగించే కత్తితో జగన్‌ భుజంపై పొడవగా జగన్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని నేడు డిశ్శార్జ్‌ అయ్యారు. అయిదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. జగన్‌పై దాడి పట్ల పలువురు నేతలు, సెబ్రిటీలు జగన్‌ను పరామర్శిస్తున్నారు. జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

jagan

జగన్‌పై దాడి పట్ల శ్రీరెడ్డి కూడా స్పందించింది. అది కాస్త ప్రస్తుతం శ్రీరెడ్డికి మైనస్‌ అయ్యింది. జగన్‌పై దాడిని తాను ఖండిస్తున్నట్టుగా, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మా జగనన్నపై ప్రతిపక్షాలు దాడులు చేయడం ఎంత కరెక్ట్‌, జగనన్న త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసింది. అది చూసిన నెటిజన్లు జగన్‌ ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత, ఆ విషయం కూడా తెలియదా బుర్రతక్కువ దానా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా తేదేపా వాళ్లు ప్రతిపక్షం అని చెప్పమన్నారా అంటూ శ్రీరెడ్డి ట్వీట్‌పై మండిపడుతున్నారు. మరికొందరైతే ఈమెకే ప్రతిపక్షం, అధికార పక్షంకు కూడా తేడా తెలియదు, అలాంటి ఈమెతో ఇంత చర్చలు అవసరమా అంటూ చాలా సింపుల్‌గా శ్రీరెడ్డిని తీసిపడేస్తున్నారు. జగన్‌పై దాడిని గురించిన ట్వీట్‌ అనుకోని విధంగా శ్రీరెడ్డి గట్టి షాక్‌ తగిలింది అని ఈమె సన్నిహితులు వాపోతున్నారు.

sree-reddy