మీడియా కవర్ చేయని హర్ష కుమార్ అలక @ దళిత – కాపు సమ్మేళనం…!

Ex MP Harsha Kumar Sensational Comments

కాకినాడ అంబేద్కర్‌ భవన్‌ వేదికగా జరిగిన ముద్రగడ పద్మనాభం, హర్ష కుమార్, చింతా మోహన్ లతోపాటు అంబేద్కర్ కుటుంబీకులను కూడా భాగస్వాములుగా చేస్తూ బుధవారం ఏర్పాటు చేసిన కాపు దళిత సమ్మేళనం విజయవంతం అయ్యింది. కానీ మరోరకంగా విఫలం అయిందా? మాజీ ఎంపీ హర్ష కుమార్ అలకబూని సభ మధ్యలోనే లేచి వెళ్లిపోయారా ? ఎన్నో అంచనాల మధ్య మొదలైన కాపు దళిత సమ్మేళనం చివరికి ఏ ఫలితాన్నీ ఇచ్చింది ? జగన్ మీద దాడిని ప్రత్యేకంగా కవర్ చేసిన ప్రధాన మీడియా ఛానల్స్ ఈ సభ గురించి కనీసం స్క్రోలింగ్ కూడా వెయకుండా వదిలివేయడంతో ఏవి వాస్తవాలు అనేది చాలా మందికి తెలియడం లేదు. ఇంతకీ ఏం జరిగింది.

mudra-gadda
కాపు దళిత సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొన్న హర్షకుమార్ అలకబూనిన మాట వాస్తవమే. అయితే సోషల్ మీడియాలో కొంతమంది, ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదనే కారణంతోనే హర్ష కుమార్ అలకబూనాడని వ్రాసుకొచ్చారు. కానీ హర్షకుమార్ అలకకు కారణం అది కాదని తెలుస్తోంది. పైగా 99 టీవీలో వచ్చిన విజువల్స్ లో స్టేజి పైన హర్షకుమార్ ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ హర్షకుమార్ అలక కి కారణం ఏమిటంటే, కాపు దళిత సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన ఈ సభలో అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే క్రైస్తవ ప్రభోదకుడు ఇండియా ప్రజాబంధు అనే ఒక నూతన పార్టీని ప్రకటించాడు. అద్దంకి రంజిత్ ఓఫిర్ చాలామంది క్రిష్టియన్లకు బాగా తెలిసిన వ్యక్తి. గతంలో టీవీ5 లో హిందూ మత పెద్దలతో ఏర్పాటుచేసిన ఒక సంచలనాత్మక డిబేట్ లో క్రైస్తవ మతం తరపున పాల్గొన్నాడు కూడా. అయితే ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేయడం, దానికి ఈ సభను వేదికగా వాడుకోవడం హర్షకుమార్ కి నచ్చలేదు. ఏ నాడు దళిత సమస్యల పట్ల ప్రజాజీవితంలోకి రానటువంటి వ్యక్తులు స్థాపించే పార్టీలను ప్రోత్సహించడానికి ఈ సభ వేదిక గా ఉందని హర్ష కుమార్ సభ నుంచి నిష్క్రమించాడు. దీంతో పాతిక మంది దళిత యువకులు సభలో కొద్ది సేపు రచ్చ చేసి, నానా యాగీ చేశారు.

harish-kumar

అంబేద్కర్‌ మనుమడు అని తిరుగుతున్న ఒక అజ్ఞాని ఆధ్వర్యములో ఇదంతా చేస్తున్నారు. అందుకే బహిష్కరించి బయటకు వచ్చేసాను. ఫ్రెండ్స్‌ అండ్‌ బ్రదర్స్‌ మన కార్యక్రమం చలో అమలాపురం 28న ఉంది. మనము యధావిధిగా ఈ కార్యక్రమము ను నిర్వహించి ఆ దళిత కుటుంబమును ఆదుకొందాం.” అని సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌లో బుధవారం ఉదయం గం.11.18లకు పోస్ట్‌ చేశారు. అయితే ఇదంతా తెలియని అమాయక వెర్రి అభిమానులు (ఓ పది మంది) ప్లెక్సీ మార్చాలి. హర్ష ఫొటో పెద్దది వేయాలి అంటూ మళ్ళీ ఫేజ్‌-2 యాగీ చేస్తూనే ఉన్నారు అంబేద్కర్‌ భవన్‌ సభలో. అంబేద్కర్‌ భవన్‌ అంతా కిటకిటలాడిన దళిత-కాపుల ఉద్యమకారులు సభాస్థలి నుండి బోయ్‌కట్‌ చేసి వెళ్ళిపోతున్న హర్షకుమార్‌ను అనుసరించలేదు. చివరి నిమిషం వరకు జనం కిటకిటలాడుతూనే ఉన్నారు. సుమారు 5వేల మంది వరకు వివిధ జిల్లాల నుండి కూడా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై ముద్రగడ, ప్రకాష్‌ అంబేద్కర్‌, సిద్ధోజిరావులకు సంఘీభావం తెలిపారు. ఇంతకీ హర్ష పిలుపునందుకుని వచ్చిన జనం పాతిక దాటరని స్థానికులు అక్కడి లోకల్ పత్రికకు ఇచ్చిన సమాచారం. వచ్చిన జనం అంతా ముద్రగడ, ప్రకాష్‌ అంబేద్కర్‌ల గురించే నన్నది నిర్వివాదాంశం. ఎంతో ప్రజ్ఞాశాలి అనుకున్న హర్ష వందిమాగధులైన భజనపరుల ట్రాప్‌లో చిత్తయ్యి అనవసర రగడ సృష్టించారు.

mp

అయితే వహర్ష కుమార్ సభలో పాల్గొనకుండా వెనుదిరగడం తనకెంతో బాధ కలిగించిందని ముద్రగడ ఆ తర్వాత ప్రసంగిస్తూ అన్నారు. హర్ష కుమార్ తనకు ఎంతో ఆప్తుడని, ఆయనతో తాను మాట్లాడతానని, తానే ఆయనను వేదిక మీదకు పిలవాలని అనుకున్నానని, ఆయనకు అవమానం జరిగితే తామందరికీ అవమానం జరిగినట్టేనని భావిస్తానని, జరిగిన పొరపాటుకు హర్షకుమార్ పెద్ద మనసు చేసుకుని మన్నించాలని ముద్రగడ తో పాటు, ఐక్య వేదిక నిర్వాహకులు అంతా హర్షకుమార్ కి విజ్ఞప్తి చేశారు. కాపు దళిత సమ్మేళనం విషయంలో ఇది మొదటి అడుగే కాబట్టి ఇలా చిన్న చిన్న గొడవలతో భవిష్యత్తులో ఈ సమ్మేళనం ముందుకు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది రాజకీయంగా పవన్ లాంటి నేతలకు లేదా చంద్రబాబు కాపు కార్పోరేషన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది 2019 ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.