ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మ‌హేష్ బాబు, కాజ‌ల్

Mahesh Babu and Kajal Agarwal in NTR Biopic Movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. ఎన్టీఆర్ సినిమా, రాజ‌కీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో… కీల‌క పాత్ర‌ల కోసం అగ్రహీరో, హీరోయిన్ల‌ను సంప్ర‌దిస్తున్నారు. ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన హీరోహీరోయిన్లు, ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌తో పాటు ఆయ‌న రాజ‌కీయ పయ‌నంలో వెంట న‌డిచిన వారంద‌రి పాత్ర‌లూ సినిమాలో చూపించాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా పాత్ర‌ల ఎంపిక జ‌రుగుతోంది. తాజాగా రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన న‌టీన‌టుల‌ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్ప‌డు టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిన మ‌ల్టీస్టారర్ మూవీలు ఎన్టీఆర్ హ‌యాంలో ఎక్కువ‌గా ఉండేవి. ఎన్టీఆర్ అనేక సినిమాల్లో ఇత‌ర హీరోల‌తో క‌లిసి న‌టించారు. నాగేశ్వ‌ర‌రావు తో పాటు… త‌ర్వాతి త‌రంలో కృష్ణ‌తోనూ ఎన్టీఆర్ సినిమాలు చేశారు. అలాగే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన‌ప్పుడు కృష్ణ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. కాబ‌ట్టి సినిమా, రాజ‌కీయం రెండింటిలోనూ కృష్ణ క్యారెక్ట‌ర్ ను చూపించాల్సి ఉంటుంది.

మ‌రి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఈ క్యారెక్ట‌ర్ ను ఎవ‌రు పోషించ‌నున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడు మ‌హేష్ బాబు… ఎన్టీఆర్ లో తండ్రి కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. కృష్ణ పాత్ర‌లో న‌టించాల్సిందిగా బాల‌కృష్ణ అడిగిన వెంట‌నే మ‌హేష్ బాబు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ లో అల‌నాటి జ‌య‌ల‌లిత పాత్ర‌కు కూడా బాగానే ప్రాధాన్యం ఉంటుంది. ఎన్టీఆర్ తో క‌లిసి జ‌య‌ల‌లిత చాలా సినిమాల్లో న‌టించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగు రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి, ఎదిగిన స‌మ‌యంలో త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత కూడా రాజ‌కీయంగా స‌త్తాచాటారు. కాబ‌ట్టి రెండు రంగాల్లోనూ జ‌య‌ల‌లిత పాత్ర ఉంటుంది. సినిమాలో ప్రాముఖ్య‌త ఉన్న ఈ క్యారెక్ట‌ర్ కోసం కాజ‌ల్ ను ఎంపిక చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. నిడివి త‌క్కువే అయినా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం కావ‌డంతో పాటు క్యారెక్ట‌ర్ కూడా ప్ర‌త్యేక‌మైన‌ది కావ‌డంతో కాజ‌ల్ కూడా ఎన్టీఆర్ లో న‌టించేందుకు అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పై న‌టీన‌టుల ఎంపిక వార్తలు మ‌రింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.