బన్నీ కొత్త సినిమా కాపీనా?

Allu Arjun new movie na Peru Surya na illu India Copy in bobbilipuli

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రం తాజాగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్నో చిత్రాలకు మంచి కథు అందించిన రచయిత వక్కంతం వంశీ చాలా కాలంగా ఈ కథతో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా చేయాలని కోరుకున్నాడు. కాని ఎన్టీఆర్‌ మొదట ఓకే అన్నా కూడా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వక్కంతం వంశీకి హ్యాండ్‌ ఇచ్చాడు. దాంతో అదే కథతో వంశీ ఇప్పుడు బన్నీ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈ సమయంలోనే ఆ కథ గురించి ఒక ఆసక్తికర విషయం చర్చ జరుగుతుంది.

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో అన్నగారు ఎన్టీఆర్‌ నటించిన ‘బొబ్బిలిపులి’ చిత్రం కథకు ‘నాపేరు సూర్య’ కథకు దగ్గర సంబంధాలు ఉంటాయని చెబుతున్నారు. అదే స్టోరీలైన్‌ను ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్లుగా మార్చి వంశీ కొత్తగా రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని దర్శకుడు సన్నిహితుల వద్ద చెప్పుకొస్తున్నాడు. అల్లు అర్జున్‌కు కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. పూర్తిగా మార్పులు చేసిన నేపథ్యంలో బన్నీ ఆ చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యాడు. ‘బొబ్బిలిపులి’ కథ అయినందు వల్లే ఎన్టీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.