హరికృష్ణ కి టీటీడీ ఛైర్మన్ మాటలో నిజముందా?

nandamuri harikrishna will get ttd chairman post

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ వార్త హల్ చెల్ చేస్తోంది. కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ తనయుడు, బావమరిది నందమూరి హరికృష్ణ కి చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తకి ఇంకో విషయం జతజేశారు. పైసా వసూల్ సినిమా షూటింగ్ లో వున్న బాలకృష్ణ స్వదేశానికి రాగానే దీనిపై బాబు ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఈ వార్తలు నిజం కావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వారికి కూడా ఈ వార్తలు నిజమన్న నమ్మకం ఏ మాత్రం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు.

జూన్ 10 న బాలయ్య తన పుట్టినరోజు పండగ సందర్భంగా పోర్చుగల్ నుంచి లైవ్ ద్వారా అభిమానులతో సంబాషించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఎంతోమంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్యతో ప్రస్తావించారు. కానీ ఏ ఒక్కరితో బాలయ్య ఆ టాపిక్ మీద మాట్లాడేందుకు సిద్ధపడలేదు. కనీసం దాన్ని కొట్టిపారేయడానికి కూడా ఇంటరెస్ట్ చూపించలేదు. అంటే అభిమానులు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నదాన్ని గుర్తించనట్టే వ్యవహరించారు బాలయ్య. అంతకుముందు లోకేష్ మంత్రి గా ప్రమాణస్వీకారం చేసే రోజు కూడా అందరినీ చనువుగా పలకరిస్తూ వచ్చిన బాలయ్య అన్న హరికృష్ణ దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాటేసిన విషయాన్ని మీడియా పసిగట్టేసింది. ఇలా గత అనుభవాల నుంచి చూస్తే హరికృష్ణ, బాలకృష్ణ ల మధ్య సయోధ్య కష్టమనే అనిపిస్తోంది. అందుకే టీటీడీ ఛైర్మన్ గిరీ వార్త నిజమైతే గానీ నమ్మలేని పరిస్థితి.