‘లండన్‌బాబులు’ బాగుంది, కాని..!

Landon Babu Movie Super Butt Hero Mines

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మారుతి సినిమా అనగానే యూత్‌ ఆడియన్స్‌లో కాస్త ఆసక్తి ఉంటుంది. ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు అయినా కూడా ఇప్పటి వరకు పలు విజయాలు సొంతం చేసుకున్నాయి. దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా చేస్తున్న మారుతి తాజాగా నిర్మించిన చిత్రం ‘లండన్‌బాబులు’. తమిళంలో విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘ఆండావన్‌ కట్టలై’ అనే చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తమిళంలో ఈ చిత్రం విజయం సాధించడంతో పాటు, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఈ చిత్రం దగ్గరగా ఉందనే ఉద్దేశ్యంతో తాను ఈ సినిమాను రీమేక్‌ చేశాను అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. చిన్ని కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విభిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటేనే అనిపిస్తుంది. ఇక ట్రైలర్‌లో మారుతి మార్క్‌ కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది, కాని హీరో విషయంలోనే నెగటివ్‌ టాక్‌ వస్తుంది. ఈ సినిమాలో నోటెడ్‌ హీరో ఎవరైనా ఉండి ఉంటే బాగుండేది. రక్షిత్‌ అనే యువ హీరో ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. ఈ కథకు రక్షిత్‌ న్యాయం చేస్తాడనే నమ్మకం కలగడం లేదు. అంతా బాగానే ఉంది కాని, హీరో సినిమాకు మైనస్‌ అవుతాడేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.