‘నా పేరు సూర్య’ సక్సెస్‌ అయితే బన్నీ మరో ప్రయోగం

allu arjun next film confirm with new director santhosh reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయాలంటే కాస్త కంగారు పడతారు. కొత్త వారితో సినిమా చేయడం అంటే సాహసం చేయడం అన్నట్లే. వారికి అనుభవ లేమితో పాటు, ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేసి సినిమాలు తీస్తారో లేదో చెప్పలేం. అందుకే స్టార్‌ హీరోలు కొత్త వారికి చాలా చాలా అరుదగా అవకాశాలు ఇస్తారు. అయితే అల్లు అర్జున్‌ మాత్రం బ్యాక్‌ టు బ్యాక్‌ కొత్త వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా ‘నా పేరు సూర్య’. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇక ఈ చిత్రం సక్సెస్‌ అయితే మరో కొత్త దర్శకుడితో సినిమా చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.

allu-arjun

పలువురు దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా చేసి, రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్న సంతోష్‌ రెడ్డి దర్శకత్వంలో బన్నీ ఒక చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు. ఇటీవలే సంతోష్‌ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడు. నల్లమల్లపు బుజ్జితో పాటు బన్నీ వాసు ఈచిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న ‘నాపేరు సూర్య’ చిత్రం సక్సెస్‌ అయితేనే సంతోష్‌ రెడ్డి దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండే అవకాశం ఉంది. ఒక వేళ ‘నా పేరు సూర్య’ సినిమా ఫలితం తారు మారు అయితే అప్పుడు స్టార్‌ దర్శకులతో తర్వాత సినిమా ఉండే అవకాశం ఉంది. రెండు మూడు సక్సెస్‌లు చేసి అప్పుడు సంతోష్‌ రెడ్డి దర్శకత్వంలో చేయాలని బన్నీ భావిస్తున్నాడు. మొత్తానికి సంతోష్‌ రెడ్డి దర్శకత్వంలో బన్నీ సినిమా అనేది కన్ఫర్మ్‌.